Corona cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది . కొత్తగా 13,166 కేసులు నమోదయ్యాయి. 26,988 మంది కోలుకున్నారు. మరో 302 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.28శాతానికి పరిమితమైంది.
- మొత్తం కేసులు: 4,28,94,345
- మొత్తం మరణాలు: 5,13,226
- యాక్టివ్ కేసులు: 1,34,235
- కోలుకున్నవారు: 4,22,46,884
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య 1,76,86,89,266కి చేరింది.
World Corona cases:
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మాత్రం కరోనా వ్యాప్తి ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 17,66,181 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 43,16,61,561, మరణాలు..59,47,095కు చేరుకున్నాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో కొత్తగా 218,431 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 273 మంది కరోనాకు బలయ్యారు.
- రష్యాలో తాజాగా 132,998 కరోనా కేసులు నమోదయ్యాయి. 762 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 996 మంది చనిపోయారు. కొత్తగా 95,493 కేసులు వెలుగుచూశాయి.
- దక్షిణ కొరియాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,70,006 మందికి వైరస్ సోకింది. 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కరోనా మహమ్మారి ధాటికి మరో 281 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 66,732 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
ఇదీ చదవండి:ఉక్రెయిన్‌లో భారత పౌరుల పడిగాపులు- 20 వేలమందికిపైగా..!