భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య(Coronavirus update) స్వల్పంగా తగ్గింది. తాజాగా 12,729 మందికి కొవిడ్ పాజిటివ్‌గా(Covid cases in India) తేలింది. కరోనా ధాటికి మరో 221 మంది మృతి చెందారు. ఒక్కరోజే 12,165 మంది వైరస్‌ను జయించారు.
- మొత్తం కేసుల సంఖ్య: 3,43,33,754
- మొత్త మరణాలు: 4,59,873
- యాక్టివ్ కేసులు: 1,48,922
- మొత్తం కోలుకున్నవారు: 3,37,24,959
టీకాల పంపిణీ..
దేశంలో టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 5,65,276 డోసుల వ్యాక్సిన్ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,07,70,46,116కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,09,758 మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 7,418 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,93,42,303కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 50,45,062కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 81,033 మందికి వైరస్ సోకింది. మరో 1,149 మంది చనిపోయారు.
- రష్యాలో మరో 40,217 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,195 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 37,269 మందికి వైరస్ బారినపడ్డారు. మరో 214 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 29,482 కరోనా కేసులు నమోదవగా.. 228 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో కొత్తగా మరో 35,662 మందికి కొవిడ్ సోకింది. 140 మంది మరణించారు.
ఇదీ చూడండి:దారుణం.. 9వ తరగతి బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం