తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా తగ్గుముఖం- 13 వేల దిగువకు కేసులు - కొవిడ్​ రికవరీలు

దేశవ్యాప్తంగా కొత్తగా 12,584 మంది కరోనా బారిన పడ్డారు. మరో 167 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 18 వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 96.43 శాతానికి చేరింది.

India reports 12,584 new COVID-19 cases, 18,385 discharges, and 167 deaths in last 24 hours, as per Union Health Ministry
దేశంలో తొలిసారి 13వేల దిగువకు కరోనా కేసులు

By

Published : Jan 12, 2021, 9:56 AM IST

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో తగ్గాయి. తాజాగా 12,584 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 4లక్షల 79వేల 179కి పెరిగింది. వైరస్ ధాటికి మరో 167 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 1లక్షా 51వేల 327కి చేరింది.

రికవరీ రేటు ఇలా..

తాజాగా 18 వేల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 1కోటి 1లక్ష 11వేల 294కి చేరింది. 2లక్షల 16వేల 558 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.43 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు 1.44 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 8లక్షల 97వేలకు పైగా నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 18కోట్ల 26లక్షలు దాటింది.

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా మరో 5.7 లక్షల పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details