దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా మరో 10,584 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 78మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య కోటి 10 లక్షల 16 వేలకు చేరింది. మరణాల సంఖ్య 1,56,463కి చేరుకుంది. సోమవారం 13,255 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 1,10,16,434
- యాక్టివ్ కేసులు: 1,47,306
- రికవరీలు: 1,07,12,665