దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 10,126 మందికి కొవిడ్ పాజిటివ్‌గా(Corona cases in India) తేలింది. కరోనా ధాటికి మరో 332 మంది మృతి చెందారు. ఒక్క కేరళలోనే 266 మంది కరోనా రోగులు మరణించారు. దేశంలో కరోనా కేసులు 266 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. అటు రికవరీ రేటు 98.25 కాగా మరణాల రేటు 1.34గా ఉంది.
- మొత్తం కేసులు: 3,43,77,113
- మొత్తం మరణాలు: 4,61,389
- యాక్టివ్ కేసులు: 1,40,638
- కోలుకున్నవారు:3,37,75,086
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 59,08,440 డోసుల వ్యాక్సిన్ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,09,08,16,356కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 3,66,656 మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 5,480 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,10,27,406 కు చేరింది. మొత్తం మరణాలు 50,70,865కి చేరాయి.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 50,418 మందికి వైరస్ సోకింది. మరో 449 మంది చనిపోయారు.
- రష్యాలో మరో 39,400 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,190 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 32,322 మందికి వైరస్ బారినపడ్డారు. మరో 57 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 27,824 కరోనా కేసులు నమోదవగా.. 187 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో కొత్తగా మరో 20,580 మందికి కొవిడ్ సోకింది. 108 మంది మరణించారు.
ఇదీ చదవండి:NCRB Report 2021: కరోనా వేళ.. వ్యాపారుల ఆత్మహత్యలే ఎక్కువ!