తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona cases: వరుసగా రెండో రోజూ 40వేలకు పైగా కరోనా కేసులు - కరోనా కొత్త కేసులు

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కొత్త కేసులు(Coronavirus India) 40వేలకు పైగా నమోదయ్యాయి. మరో 496 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

India cases
కరోనా కేసులు

By

Published : Aug 27, 2021, 9:40 AM IST

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Corona virus India) వరుసగా రెండో రోజూ 40వేలకుపైగా నమోదైంది. కొత్తగా 44,658 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో మంది 496 మరణించారు. ఒక్కరోజే 32,988 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,26,03,188
  • మొత్తం మరణాలు: 4,36,861
  • మొత్తం కోలుకున్నవారు: 3,18,21,428
  • యాక్టివ్ కేసులు: 3,44,899

వ్యాక్సినేషన్

దేశవ్యాప్తంగా గురువారం మరో 79,48,439 కొవిడ్​ టీకా(Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 61,22,08,542 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

కొవిడ్​ పరీక్షలు

దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 18,24,931 కొవిడ్​ పరీక్షలు(Covid tests) చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 51,49,54,309కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకుపైగా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కలిపి మరో 7 లక్షల 13వేల మంది వైరస్ బారినపడ్డారు. మరో 10,700 మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. అగ్రరాజ్య అమెరికాలో అత్యధికంగా 1,69,953 కేసులు నమోదయ్యాయి. అక్కడ మరో 1,215 మంది మృత్యువాత పడ్డారు. బ్రెజిల్, బ్రిటన్​ ఈరాన్లో 30వేలకు పైగా కొవిడ్ కేసులు వెలుగు చూశాయి.

ఇదీ చూడండి:భారత్‌లో కొవిడ్‌ అధ్యయనానికి గిన్నిస్‌ రికార్డ్‌!

ABOUT THE AUTHOR

...view details