తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో ఒక్కరోజే 3 లక్షలు దాటిన కరోనా కేసులు - భారత్​లో కొవిడ్​ మరణాలు

భారత్​లో కరోనా మహోగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజే 3,14,835 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 2,104 మంది మృతి చెందారు. లక్షా 78 వేల మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రపంచంలోనే ఓ దేశంలో నమోదైన రోజువారీ కేసుల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం.

India covid-19 cases
భారత్​ కరోనా కేసులు

By

Published : Apr 22, 2021, 9:45 AM IST

Updated : Apr 22, 2021, 11:29 AM IST

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 3,14,835 మందికి వైరస్​ సోకింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా రోజువారీ కేసులు నమోదైన దేశంగా రికార్డు సృష్టించింది భారత్​. మరో 2,104 మంది చనిపోయారు. 1,78,841 మంది కొవిడ్​ను జయించారు.

మొత్తం కేసులు: 1,59,30,965

మొత్తం మరణాలు: 1,84,657

మొత్తం కోలుకున్నవారు: 1,34,54,880

యాక్టివ్ కేసులు: 22,91,428

క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఫలితంగా యాక్టివ్​ కేసులు.. 14.38 శాతానికి పెరిగాయి. రికవరీ రేటు.. 84.46 శాతానికి పడిపోయింది. మరణాల రేటు 1.16గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో మొత్తంగా 13 కోట్ల 23 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

కొవిడ్​ వ్యాప్తి కట్టడిలో భాగంగా బుధవారం ఒక్కరోజే 16,51,711 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ టెస్ట్​ల సంఖ్య 27 కోట్ల 27 లక్షలు దాటింది.

ఇదీ చూడండి:సీతారాం ఏచూరి తనయుడు కరోనాతో మృతి

Last Updated : Apr 22, 2021, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details