దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 81,466 కేసులు వెలుగుచూశాయి. మరో 469 మంది మహమ్మారికి బలయ్యారు.
- మొత్తం కేసులు: 1,23,03,131
- మొత్తం మరణాలు: 1,63,396
- కోలుకున్నవారు: 1,15,25,039
- యాక్టివ్ కేసులు: 6,14,696
వైరస్ సోకిన వారిలో 50,356 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 93.68 శాతంగా, మరణాల రేటు 1.33 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.