భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona virus India) వరుసగా మూడ రోజూ 40వేలకుపైగా నమోదైంది. కొత్తగా 46,759 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 509మంది మరణించారు. 31,374 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు: 3,26,49,947
- మొత్తం మరణాలు: 4,37,370
- మొత్తం కోలుకున్నవారు: 3,18,52,802
- యాక్టివ్ కేసులు: 3,59,775
ఒక్క రోజే కోటి మందికి టీకా..
కరోనా వ్యాక్సినేషన్లో (COVID vaccination) భారత్ నూతన మైలురాయిని అందుకుంది. శుక్రవారం కోటికిపైగా టీకాలు వేసింది. దేశంలో ఒక్క రోజులో ఇచ్చిన టీకాల్లో ఇదే అత్యధికం. కొవిన్ పోర్టల్ ప్రకారం శుక్రవారం ఒక్కరోజే .. 1,00,64,032 డోసులు పంపిణీ చేసింది.
ఆగస్టు 27 సాయంత్రం 7గంటల వరకు మొత్తం మీదా 62.09కోట్ల డోసులను అందించినట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది. 18-44 ఏళ్ల వారిలో 23,72,15,353 మంది తొలి డోసు, 2,45,60,807 మంది రెండో డోసు తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రపంచంపై కొవిడ్ పంజా..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కలిపి 7.11 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 9,900 మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. అగ్రరాజ్య అమెరికాలో కొత్తగా రికార్డు స్థాయిలో 190,370 కేసులు నమోదయ్యాయి. అక్కడ మరో 1,300 మంది మృతి చెందారు. బ్రెజిల్, రష్య, ఫ్రాన్స్, యూకే, టర్కీ వంటి దేశాల్లోనూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.
ఇదీ చదవండి:కరోనా కట్టడి కోసం ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్