దేశంలో కరోనా కేసులు(Corona Cases) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 41,649 మందికి వైరస్ సోకగా.. 37,291 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 593 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు:3,16,13,993
- మొత్తం మరణాలు:4,23,810
- కోలుకున్నవారు:3,07,81,263
- యాక్టివ్ కేసులు:4,08,920
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 46,15,18,479 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 52,99,036 డోసులు అందించినట్లు తెలిపింది.