తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona Update: దేశంలో మరో 41 వేల కరోనా కేసులు - కరోనా వ్యాక్సినేషన్

దేశంలో కొత్తగా 41,383 మందికి కరోనా సోకింది. 38,652 మంది కోలుకోగా.. 507 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 41,78,51,151 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది.

corona cases latest
దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు

By

Published : Jul 22, 2021, 9:25 AM IST

దేశంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. కొత్తగా 41,383 మందికి వైరస్​ సోకగా 38,652 మంది కోలుకున్నారు. 507 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం.. రికవరీ రేటు 97.35 శాతంగా నమోదైంది.

  • మొత్తం కేసులు:3,12,57,720‬
  • మొత్తం మరణాలు:4,18,987
  • కోలుకున్నవారు:3,04,29,339
  • యాక్టివ్​ కేసులు:4,09,394

పరీక్షలు

దేశవ్యాప్తంగా బుధవారం 17,18,439 మందికి పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం నిర్వహించిన పరీక్షల సంఖ్య 45,09,11,712కి చేరినట్లు తెలిపింది.

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు 41,78,51,151 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 22,77,679 డోసులు అందించినట్లు తెలిపింది.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 5,53,711 మందికి కరోనా సోకింది. వైరస్​ ధాటికి మరో 8,539 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,27,92,402కు చేరింది. మరణాల సంఖ్య 41,41,916కు పెరిగింది.

కొత్త కేసులు..

  • అమెరికా- 56,525
  • బ్రెజిల్-​ 54,748
  • ఫ్రాన్స్-​ 21,539
  • బ్రిటన్​- 44,104
  • రష్యా- 23,704

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details