తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid 19 India: దేశంలో మరో 39 వేల కరోనా కేసులు - icmr corona tests

దేశంలో కొత్తగా 39,097 మందికి కరోనా(Covid 19 India) సోకింది. మరో 35 వేల మంది కోలుకోగా.. 546 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases india
దేశంలో కరోనా కేసులు

By

Published : Jul 24, 2021, 9:25 AM IST

Updated : Jul 24, 2021, 9:45 AM IST

దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే కాస్త పెరిగాయి. కొత్తగా 39,097 మందికి వైరస్(Covid 19 India)​ సోకగా 35,087 మంది కోలుకున్నారు. 546 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు:3,13,32,159
  • మొత్తం మరణాలు:4,20,016
  • కోలుకున్నవారు:3,05,03,166
  • యాక్టివ్​ కేసులు:4,08,977

దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 97.35శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల వాటా.. 1.31శాతంగా ఉన్నట్లు చెప్పింది.

పరీక్షలు

దేశవ్యాప్తంగా శుక్రవారం 16,68,561 మందికి పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు 42,78,82,261 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 54,76,423 డోసులు అందించినట్లు తెలిపింది.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,73,762 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 8,646 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,40,14,060కి చేరగా.. మరణాల సంఖ్య 41,59,695కు పెరిగింది.

కొత్త కేసులు..

  • అమెరికా- 67,485
  • బ్రెజిల్-​ 45,460
  • ఫ్రాన్స్-​ 19,561
  • బ్రిటన్​- 36,389
  • రష్యా- 23,811

ఇవీ చూడండి:

Last Updated : Jul 24, 2021, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details