తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు - కరోనా వ్యాక్సినేషన్​

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం మరో 3,43,144 మంది వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Corona virus, Covid-19
కరోనా, కొవిడ్​-19

By

Published : May 14, 2021, 9:40 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 3లక్షల 43వేల 144 కేసులు వెలుగుచూశాయి. మరో 4,000 మంది మహమ్మారికి బలయ్యారు.

  • మొత్తం కేసులు : 2,40,46,809
  • మొత్తం మరణాలు : 2,62,317
  • యాక్టివ్​ కేసులు : 37,04,893
  • మొత్తం కోలుకున్నవారు : 2,00,79,599

ఇదీ చదవండి:'కరోనా మహమ్మారి మరోమారు ఉగ్రరూపం'

వైరస్​ సోకిన వారిలో మరో 3.44 లక్షల మందికిపైగా కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 83.50 శాతంగా, మరణాల రేటు 1.09 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దేశంలో గురువారం ఒక్కరోజే 18లక్షల 75వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 31కోట్ల 13లక్షలు దాటింది.

కరోనా కట్టడిలో భాగంగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 17.92 కోట్ల టీకా డోసుల పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి:'18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్‌'..అని కేంద్రం చెప్పినా..!

ABOUT THE AUTHOR

...view details