దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా 38,353 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ రికవరీ రేటు 97.45 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,86,351కి పెరిగింది.
వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 53.24 కోట్ల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
కొవిడ్ పరీక్షలు
మంగళవారం ఒక్కరోజే దేశంలో 17,72,962 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 48,50,56,507 కు చేరింది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 5,609 మందికి కరోనా సోకగా.. 137 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 7,568 మంది కోలుకున్నారు.
- కర్ణాటకలో కొత్తగా 1,338 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,947 మంది కోలుకోగా.. 31 మంది మృతిచెందారు.
- అసోంలో కొత్తగా 1,120 మందికి కరోనా సోకింది. 1,066 మంది కోలుకోగా వైరస్ ధాటికి మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మేఘాలయాలో కొత్తగా 411 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 11 మంది చనిపోయారు.
ఇదీ చదవండి:'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రంలోనే.. బూస్టర్ డోసులు కష్టం'