తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 3.82 లక్షల మందికి కరోనా - దేశంలో కొవిడ్ నుంచి కోలుకున్నవారు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా 3.82 లక్షల‬ మంది వైరస్​ బారినపడ్డారు. మరో 3,780 మంది మృతిచెందారు.

covid in india
కొవిడ్ కేసులు

By

Published : May 5, 2021, 10:00 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 3,82,315 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 2,06,65,148కు చేరాయి.మరో 3,780 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,06,65,148
  • మొత్తం మరణాలు:2,26,188
  • మొత్తం కోలుకున్నవారు:1,69,51,731
  • యాక్టివ్ కేసులు:34,87,229

కొవిడ్​ వ్యాప్తి కట్టడిలో భాగంగా మంగళవారం ఒక్కరోజే 15,41,299 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ టెస్ట్​ల సంఖ్య 29 కోట్ల 48 లక్షల 52 వేలు దాటింది.

కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 16.04 కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఇదీ చదవండి:టీకా తీసుకున్నా కరోనా వస్తుందా?

ABOUT THE AUTHOR

...view details