దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినా.. మరణాల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా మరో రెండు లక్షల 59వేల 170 కేసులు వెలుగులోకి వచ్చాయి. 1761 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో సంభవించిన మరణాలలో ఇవే అధికం.
- మొత్తం కేసులు:1,53,21,089
- మొత్తం మరణాలు:1,80,530
- కోలుకున్నవారు:1,31,08,582
- యాక్టివ్ కేసులు:20,31,977
సోమవారం ఒక్కరోజే 15,19,486 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మొత్తంగా 26 కోట్ల 94 లక్షల పరీక్షలు జరిపినట్లు స్పష్టం చేసింది.