దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 93,249 మందికి వైరస్ సోకినట్టు తేలింది. మరో 513 మంది మహమ్మారికి బలయ్యారు.
- మొత్తం కేసులు: 12,485,509
- మొత్తం మరణాలు: 1,64,623
- కోలుకున్న వారు: 1,16,29,289
- యాక్టివ్ కేసులు: 6,91,597
దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 93,249 మందికి వైరస్ సోకినట్టు తేలింది. మరో 513 మంది మహమ్మారికి బలయ్యారు.
వైరస్ సోకిన వారిలో 60,048 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 93.14 శాతంగా, మరణాల రేటు 1.32 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజాగా.. 27.38 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 7.59 కోట్లకు చేరింది.