దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 4,03,738 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 4,092 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,22,96,414
- మొత్తం మరణాలు: 2,42,362
- మొత్తం కోలుకున్నవారు: 1,83,17,404
- యాక్టివ్ కేసులు: 37,36,648
ఇదీ చదవండి:'వారం రోజులుగా 180 జిల్లాల్లో కొత్త కరోనా కేసుల్లేవు'
కొవిడ్ సోకినవారిలో 3,86,444మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 82.15 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.09 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.