దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర స్థాయిలో కొత్తగా 3,68,147 కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో మరో 3,417 మంది చనిపోయారు.
- మొత్తం కేసులు: 1,99,25,604
- మొత్తం మరణాలు: 2,18,959
- మొత్తం కోలుకున్నవారు: 16,29,3003
- యాక్టివ్ కేసులు: 34,13,642
ఇదీ చదవండి:కరోనా 'మహా' విలయం- మరో 56వేల కేసులు
కొవిడ్ సోకిన వారిలో 3,00,732 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 81.77 శాతానికి పడిపోగా.. మరణాల రేటు 1.10 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 15.71 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇదీ చదవండి:బ్రిటన్ నుంచి భారత్కు మరో 1000 వెంటిలేటర్లు