దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గినా.. మారణహోమం మాత్రం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 2,22,315 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మహమ్మారి సోకిన వారిలో ఆదివారం ఒక్కరోజే 4,454 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య మూడు లక్షల మార్క్‌ను దాటింది.
ఇదీ చదవండి:భారత్‌లో కరోనా.. అంకెల్లో ఇలా...
- మొత్తం కేసులు: 2,67,52,447
- మొత్తం మరణాలు: 3,03,720
- కోలుకున్నవారు: 2,37,28,011
- యాక్టివ్ కేసులు: 27,20,716
ఇదీ చదవండి:భారత్‌లో 2% కాదు.. 24% మందికి కరోనా!
వైరస్ బారినపడిన వారిలో 3,02,544 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 88.69 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.14 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చదవండి:టీకా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?