తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 16,488 మందికి కరోనా - కొవిడ్​-19 వ్యాక్సిన్​ లబ్ధిదారులు

దేశంలో తాజాగా 16,488 మందికి కరోనా సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 10లక్షల 79వేల 979కి చేరింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 12,771 మంది కోలుకున్నారు.

INDIA REGISTERED 16,488 NEW COVID-19 POSITIVE CASES AND 113 DEATHS IN LAST 24 HOURS
దేశంలో కొత్తగా 16,488 మందికి కరోనా

By

Published : Feb 27, 2021, 10:04 AM IST

Updated : Feb 27, 2021, 10:55 AM IST

దేశంలో కొత్తగా 16,488 మందికి కొవిడ్​​​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 113 మంది కొవిడ్​తో మృతిచెందారు.

  • మొత్తం కేసులు: 1,10,79,979
  • మరణాలు: 1,56,938
  • రికవరీల సంఖ్య: 1,07,63,451
  • యాక్టివ్​ కేసులు: 1,59,590

ఇదీ చదవండి:కొవిడ్​ పరీక్ష చేసి.. స్మార్ట్​ఫోన్​కు సమాచారమిచ్చే చిప్​

వైరస్​ సోకిన వారిలో 12,771 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు మరోసారి తగ్గి.. 97.14కు చేరింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.

దేశవ్యాప్తంగా మరో 7,69,904 మందికి కొవిడ్​ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటీ 42లక్షల 42వేలు దాటినట్టు పేర్కొంది.

ఇదీ చదవండి:కరోనా వైరస్ రకాలను ముందే పసిగట్టొచ్చు!

Last Updated : Feb 27, 2021, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details