తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఉగ్రరూపం: ఒక్కరోజే లక్షా 52 వేల కేసులు - దేశంలో కరోనా వ్యాప్తి

దేశంలో రెండో దశ కరోనా పంజా విసురుతోంది. ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1,52,879 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 839 మంది ప్రాణాలు కోల్పోయారు.

INDIA REGISTERED 1,52,879 NEW COVID-19 POSITIVE CASES AND 839 DEATHS IN LAST 24 HOURS
కరోనా పంజా: మరో 1.52 లక్షల మందికి వైరస్​

By

Published : Apr 11, 2021, 10:07 AM IST

దేశంలో కొవిడ్​ విలయ తాండవం కొనసాగుతోంది. రోజువారి కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే 1,52,879 మంది కొవిడ్​ బారినపడ్డారు. వైరస్​ ధాటికి మరో 839 మంది బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,33,58,805
  • మొత్తం మరణాలు: 1,69,275
  • కోలుకున్న వారు: 1,20,81,443
  • యాక్టివ్​ కేసులు: 11,08,087

ఇదీ చదవండి:కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..

కొవిడ్​ సోకిన వారిలో మరో 90,584 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 90.44 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.27 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.

దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 14లక్షల 12వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 25 కోట్ల 66 లక్షలు దాటింది.

ఒక్కరోజే 35.19 లక్షల మోతాదుల కరోనా టీకాను సరఫరా చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 10.15 కోట్ల​ డోసుల్ని పంపిణీ చేసినట్టు తెలిపింది.

ఇదీ చదవండి:నేటి నుంచి 'టీకా ఉత్సవ్'- అర్హులందరికీ వ్యాక్సిన్​

ABOUT THE AUTHOR

...view details