దేశంలో గురువారంతో పోల్చితే శుక్రవారం రోజు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 13,993 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 101 మంది వైరస్‌కు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 56వేల 212కు చేరింది.
- మొత్తం కేసులు: 1,09,77,387
- మరణాలు: 1,56,212
- రికవరీల సంఖ్య: 1,06,78,048
- యాక్టివ్ కేసులు: 1,43,127
కొవిడ్ బారినపడిన వారిలో 10,307 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.27 శాతానికి తగ్గింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.