దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే భారీగా తగ్గింది. శుక్రవారం ఒక్కసారిగా పెరుగుదల కనిపించినప్పుటికీ..మళ్లీ 14వేల దిగువకు చేరుకున్నాయి. ఇవాళ కొత్తగా 13,083 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 137 మంది మహమ్మారికి బలయ్యారు.
- మొత్తం కేసులు: 1,07,33,131
- యాక్టివ్ కేసులు: 1,69,824
- కోలుకున్నవారు: 1,04,91,160
- మొత్తం మరణాలు: 1,54,147
తాజాగా 14,808 మంది వైరస్ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఫలితంగా దేశవ్యాప్త రికవరీ రేటు 96.98 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు స్థిరంగా 1.44 శాతంగా నమోదైంది.
దేశవ్యాప్తంగా మరో 7లక్షల 56ల 329 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 19కోట్ల 58లక్షలకు చేరింది.