దేశంలో కొవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 1,26,789 మంది మహమ్మారి బారినపడ్డారు. మరో 685 మందిని కొవిడ్ బలి తీసుకుంది.
- మొత్తం కేసులు: 1,29,28,574
- మొత్తం మరణాలు: 1,66,862
- కోలుకున్న వారు: 1,18,51,393
- యాక్టివ్ కేసులు: 9,10,319
ఇదీ చదవండి:'మహా'లో కరోనా రికార్డు- ఒక్కరోజే 60 వేల కేసులు
కరోనా సోకిన వారిలో కొత్తగా 59,258 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 91.67 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.29 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.