దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 12,059 మంది మహమ్మారి బారినపడ్డారు. వైరస్ సోకిన వారిలో మరో 78 మంది చనిపోయారు.
- మొత్తం కేసులు: 10,826,363
- యాక్టివ్ కేసులు: 1,48,766
- కోలుకున్నవారు: 1,05,22,601
- మొత్తం మరణాలు: 1,54,996
కొవిడ్ బారినపడిన వారిలో మరో 11,805 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.19 శాతంగా నమోదవ్వగా.. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతంగా ఉంది.