దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. మరో 11,713 మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 95 మంది చనిపోయారు.
- మొత్తం కేసులు: 10,814,304
- యాక్టివ్ కేసులు: 1,48,590
- కోలుకున్నవారు: 1,05,10,796
- మొత్తం మరణాలు: 1,54,918
కరోనా సోకిన వారిలో మరో 14,488 మంది వైరస్ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.19 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతంగా నమోదైంది.