దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 11,427 వైరస్ కేసులు బయటపడ్డాయి. కరోనా బారినపడిన వారిలో మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 1,07,57,610
- యాక్టివ్ కేసులు: 1,68,235
- కోలుకున్నవారు: 1,04,34,983
- మొత్తం మరణాలు: 1,54,392
కరోనా సోకిన వారిలో మరో 11,858 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్త రికవరీ రేటు 97 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.44 శాతంగా నమోదైంది.