తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో దూసుకెళ్లిన భారత్.. 54శాతం జంప్ - రికార్డు స్థాయిలోకి రక్షణ శాఖ ఉత్పత్తుల ఎగుమతులు

defence exports India: రక్షణ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ దూసుకెళ్లింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.13 వేల కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. గతేడాది కంటే ఇది 54 శాతం అధికమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

defence exports
రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు

By

Published : Jul 9, 2022, 3:45 PM IST

defence exports India: 2021-22 ఆర్థిక సంవత్సరం దేశంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 13వేల కోట్లతో రికార్డ్‌ స్థాయిని నమోదు చేశాయి. గతేడాది కంటే 54శాతం అధికమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. రక్షణ ఉత్పత్తులు, వాటి సాంకేతికతను అమెరికా, ఫిలిప్పీన్స్‌, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాలతోపాటు ఆఫ్రికాకు ఎగుమతి చేసినట్లు పేర్కొన్నాయి.

రక్షణ ఎగుమతుల్లో ప్రైవేటు కంపెనీల వాటా 70 శాతంగా ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థల వాటా 30 శాతంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2025 నాటికి వార్షిక రక్షణ ఎగుమతులు 5 బిలియన్‌ డాలర్లు, దేశీయంగా రక్షణ ఉత్పత్తులు 25 బిలియన్లు డాలర్లుగా.. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వీడన్‌కు చెందిన మేథో మథన సంస్థ- అంతర్జాతీయ ఆయుధ బదిలీకి సంబంధించి మార్చిలో ఓ నివేదిక విడుదల చేసింది. ఆయుధ ఎగుమతులకు సంబంధించి 25 అగ్రశ్రేణి దేశాలతో విడుదల చేసిన జాబితాలో భారత్‌ 23వ స్థానంలో ఉంది.

ఇదీ చదవండి:'నేను దుర్గాదేవిని.. నా భర్తను వదలండి'.. మహిళ హైడ్రామా.. పోలీస్ స్టేషన్​లో చేతబడి!

భద్రత వలయంలో ఉన్నా.. హత్యకు గురైన నేతలెందరో..

ABOUT THE AUTHOR

...view details