తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid-19: దేశంలో రికార్డ్​ స్థాయిలో కరోనా మరణాలు - కరోనా కేసులు తాజా

దేశవ్యాప్తంగా కొత్తగా 94,052 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 91 లక్షలకు చేరింది. అయితే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా మరణాలు పెరిగాయి.

INDIA CASES TODAY
కరోనా కేసులు తాజా

By

Published : Jun 10, 2021, 9:40 AM IST

Updated : Jun 10, 2021, 10:27 AM IST

దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. కొత్తగా 94,052 కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ ఒక్కరోజులో 6,148మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు ఇదే అత్యధికం. అయితే బిహార్​ మరణాల డేటాను సవరించిన నేపథ్యంలో మృతుల సంఖ్య ఈ స్థాయిలో పెరిగింది. సవరణ తర్వాత బిహార్​లో 9,429 కేసులు నమోదయ్యాయి.

  • మొత్తం కేసులు: 2,91,83,121
  • యాక్టివ్ కేసులు:11,67,952
  • కోలుకున్నవారు: 2,76,55,493
  • మొత్తం మరణాలు: 3,59,676

కరోనా సోకిన వారిలో మరో 1,51,367 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రికవరీ రేటు 94.55 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.22 శాతానికి తగ్గింది.

దేశంలో ఇప్పటివరకు 23,90,58,360 మందికి వ్యాక్సిన్​ అందింది.

టెస్టుల సంఖ్య

దేశవ్యాప్తంగా 20,04,690 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్టు​ల సంఖ్య 37,21,98,253కి పెరిగింది.

ఇవీ చదవండి:తమిళనాడులో 18వేల దిగువకు కరోనా కేసులు

పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు: కేంద్రం

Last Updated : Jun 10, 2021, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details