వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ సూచీలో భారత్ చివర నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న 11 దేశలపై జరిగిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను 'ద ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్' అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో భారత్ 10 వ స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియా, చైనా, జపాన్, భారత్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్లాండ్, న్యూజిలాండ్ దేశాలలోని 11 ఆరోగ్య ప్రమాణాలు ఏలా ఉన్నాయనే విషయాన్ని తన నివేదికలో పేర్కొంది. ఇందులో సరైన వ్యక్తికి సరైన సమయంలో అవసరమైన మేరకు వైద్య సదుపాయం అందుతుందా లేదా అనే దానిని ప్రామాణికంగా తీసుకుని ర్యాంకులను ప్రకటించింది.