భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దు(Ind Pak Border), నియంత్రణ రేఖ వెంబడి 2010-21 మధ్య 14,411 సార్లు కాల్పులు (Ceasefire India Pakistan) జరిగినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 2010 నుంచి ఫిబ్రవరి 2021 వరకు 14,411 సార్లు కాల్పులు జరగగా.. మొత్తం 267 మంది మృతిచెందారని పేర్కొంది.
సమాచార హక్కు చట్టం ప్రకారం పుణెకు చెందిన సామాజిక కార్యకర్త ప్రఫుల్ సార్దా దాఖలు చేసిన అభ్యర్థనకు.. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని (ఎస్- జేకే), సీపీఐఓ విభాగం డైరెక్టర్ సులేఖ ఈ వివరాలు తెలిపారు. 2010- 2021 ఫిబ్రవరి మధ్య కాలానికి చెందిన గణాంకాలను వెల్లడించారు.
మొత్తం కాల్పులు... 14,411
- (2010- 2014)... 1,178
- (2015- 2021 ఫిబ్రవరి)... 13,235
కాల్పుల్లో మృతిచెందిన సైనికులు.. 138
- (2010- 2014)... 20
- (2015- 2021 ఫిబ్రవరి)... 118
గాయపడ్డ సైనికులు... 664
- (2010-2014)... 97
- (2015-2021 ఫిబ్రవరి)... 567