తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఒమిక్రాన్‌' వేళ.. భారత్‌కు ఊరటనిచ్చే వార్త! - tamil nadu corona cases

India omicron seropositivity: అధికస్థాయిలో ఉన్న సీరోపాజిటివిటీ రేటు వల్ల కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ పట్ల భారతీయులు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రతినిరోధకాలను కలిగి ఉండటం వల్ల ప్రజలు వ్యాధి బారినపడినప్పటికీ.. లక్షణాలు చాలా స్వల్పంగా ఉండనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ శాతం మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు.. మహారాష్ట్రలో ఇటీవల ఒమిక్రాన్ బారినపడ్డ ఏడాదిన్నర చిన్నారి పూర్తిగా వ్యాధి నుంచి కోలుకుంది.

india omicron seropositivity rate
సీరోపాజిటివిటీ రేటు

By

Published : Dec 12, 2021, 4:23 AM IST

Updated : Dec 12, 2021, 7:15 AM IST

India omicron seropositivity: కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం కాస్త ఊపిరిపీల్చుకుంటుంటే.. ఒమిక్రాన్ రూపంలో వైరస్ షాకిచ్చింది. దాంతో వ్యాక్సినేషన్ రేటు పెరగాల్సిన ఆవశ్యకతను, కొవిడ్ నియమాలు పాటించాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఈ కొత్త కలవరం వేళ.. భారత్‌కు కాస్త ఊరటనిచ్చే అంశం.. అదే సీరోపాజిటివిటీ రేటు. అధికస్థాయిలో ఉన్న ఈ సీరోపాజిటివిటీ రేటు వల్ల భారతీయులు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని తెలుస్తోంది. భారత్​ 70 నుంచి 80 శాతం సీరో పాజిటివిటీ రేటు కలిగి ఉందని సీఎస్‌ఐఆర్ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్ర ఓ మీడియా సంస్థకు తెలిపారు.

"భారత్​ 70 నుంచి 80 శాతం సీరో పాజిటివిటీ రేటును కలిగి ఉంది. ఒమిక్రాన్ వేళ.. ఇది దేశానికి ఒక సానుకూలత. నగరాల్లో 90 శాతానికి పైగా ప్రజలు ప్రతిరోధకాలను కలిగి ఉన్నారు. ఈ ప్రతిరోధకాలను కలిగి ఉండటం మూలానా.. ప్రజలు వ్యాధి బారినపడినప్పటికీ, లక్షణాలు చాలా స్వల్పంగా ఉండనున్నాయి. ఎక్కువశాతం మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చు. టీకా కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి, చిన్నారులకు కూడా టీకాలు అందజేస్తే.. పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే వైరస్ భారీస్థాయిలో ప్రబలకుండా ఉండాలంటే మాస్కులు వాడటం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్ నియమావళిని తప్పకుండా పాటించాలి."

-రాకేశ్ మిశ్ర, సీఎస్‌ఐఆర్ మాజీ డైరెక్టర్

Corona third wave in india: వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో మూడో ముప్పు వస్తుందన్న అంచనాలపై రాకేశ్ మిశ్ర స్పందించారు. "కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా పలు దఫాలుగా వైరస్ విజృంభించొచ్చు. అయితే ఎక్కువ మందిలో ప్రతిరోధకాలు ఉండటం వల్ల.. తీవ్ర లక్షణాలకు ఆస్కారం ఉండకపోవచ్చు. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం స్వల్ప స్థాయిలో మరో దఫా వైరస్ విజృంభిస్తుంది. కొత్త వేరియంట్లు వల్ల తేలికపాటి లక్షణాలు, వైరస్‌ వేగంగా ప్రబలడమనేది సాధారణమే" అని తెలిపారు. అయితే ఒక్కోసారి భారీ ప్రమాదాన్ని తీసుకువచ్చే వేరియంట్లు కూడా వెలుగుచూడొచ్చని హెచ్చరించారు.

ఇదీ చూడండి:చాపకింద నీరులా కరోనా- 'ఒమిక్రాన్​'తో ఆంక్షల్లోకి దేశాలు!

కోలుకున్న ఏడాదిన్నర చిన్నారి..

corona third wave in india: ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ ఉపశమనం కలిగించే వార్త! మహారాష్ట్రలో ఇటీవల ఒమిక్రాన్‌ బారిన పడిన ఏడాదిన్నర చిన్నారి కోలుకుంది. చిన్నారికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేసినట్టు పుణె జిల్లా పింప్రీ-చించ్వాడ్‌ ప్రాంత ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అలాగే, ఇదే ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలుడిలోనూ ఈ కొత్త వేరియంట్‌ లక్షణాల్లేవని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. పింప్రీ చించ్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో తాజాగా ఒమిక్రాన్‌ సోకిన నలుగురిలో మూడేళ్ల బాలుడు ఒకరు కాగా.. మిగతా ముగ్గురిలో ఇద్దరు పురుషులు.. ఒకరు మహిళ ఉన్నారు. అయితే, ఈ నలుగురూ నైజీరియా నుంచి తన ఇద్దరు కూతుళ్లతో వచ్చిన మహిళతో కాంటాక్టు అయినవారే కావడం గమనార్హం.

Omicron variant: కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ దాదాపు 60 దేశాలకు వ్యాపించింది. భారత్‌లో 33 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ బాధితుల్లో తీవ్ర లక్షణాల ఆనవాళ్లు కనిపించలేదు. ఆ విషయం ఊరటనిస్తున్నప్పటికీ.. ఈ వేరియంట్‌ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని ప్రారంభ నివేదికలను బట్టి వెల్లడవుతోంది. అందుకే నిర్లక్ష్యం వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు ప్రజల్ని హెచ్చరిస్తున్నాయి.

ఇదీ చూడండి:బూస్టర్‌ డోసు వేసుకున్నా వదలని 'ఒమిక్రాన్‌'!

వారికి అనుమతి లేదు..

Madurai covid restrictions: కరోనా కట్టడికి తమిళనాడు మధురై జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 13 నుంచి కొవిడ్ టీకా తీసుకోనివారిని బహరంగ ప్రదేశాల్లోకి అనుమతించబోమని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్​. అనీశ్ శేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

"కొవిడ్ టీకా వేయించుకోనివారిని దుకాణాలు, సూపర్​మార్కెట్లు, థియేటర్లు, పెళిళ్లు, షాపింగ్ మాళ్లు, బ్యాంకులు, మద్యంషాపుల వంటి ప్రాంతాలకు అనుమతించబోం" అని కలెక్టర్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకోనివారిని సమీపంలోని టీకా కేంద్రాలకు పంపించే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

అంతకుముందు.. కనీసం ఒక డోసు కొవిడ్ టీకా అయినా ప్రజలు తప్పనిసరిగా వేయించుకోవాలని మధురై జిల్లా యంత్రాంగం ఒక వారం గడువు ఇచ్చింది. ఈ గడువు ముగిసిన నేపథ్యంలో తాజా ఆంక్షలు విధించింది.

ఇవీ చూడండి:

Last Updated : Dec 12, 2021, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details