తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా 16 కేసులు - కేరళ ఒమిక్రాన్

India Omicron cases: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దిల్లీలో ఆరు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలో ఐదు, కేరళలో నాలుగు కేసులు నమోదయ్యాయి.

Karnataka Omicron cases
Karnataka Omicron cases

By

Published : Dec 20, 2021, 12:42 PM IST

Updated : Dec 20, 2021, 1:15 PM IST

India Omicron cases: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 169కు పెరిగింది.

కర్ణాటకలో మరో ఐదు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. బాధితుల్లో నలుగురు మహిళలు ఉన్నారని ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడించారు. కొత్తగా నిర్ధరణ అయిన కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 19కు పెరిగిందని చెప్పారు.

Kerala Omicron cases

కేరళలోనూ కొత్తగా నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15కు పెరిగిందని కేరళ వైద్య శాఖ కార్యాలయం వెల్లడించింది.

దిల్లీలో ఆరు..

దిల్లీలో కొత్తగా మరో ఆరు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. ఇందులో 12 మంది ఇప్పటికే కోలుకున్నారని దిల్లీ వైద్య శాఖ వెల్లడించింది. మిగిలిన 16 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొంది.

ఇదీ చదవండి:శబరిమలలో ఆంక్షల సడలింపు- మరింత మంది భక్తులకు అవకాశం

Last Updated : Dec 20, 2021, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details