తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2020, 5:40 AM IST

ETV Bharat / bharat

పారిస్​ ఒప్పందం కంటే ఎక్కువే సాధిస్తాం:మోదీ

'వాతావరణ లక్ష్య సదస్సు-2020'ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రసంగించారు. పారిస్​ వాతావరణ ఒప్పందానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా హానికారక ఉద్గారాల కట్టడికి భారత్​ కట్టుబడి ఉందని తెలిపారు.

PM Modi
మోదీ

వాతావరణంలో హానికారక ఉద్గారాల కట్టడికి ఉద్దేశించిన 'పారిస్​ ఒప్పందం'లోని లక్ష్యాలను మించి భారత్​ విజయాలను సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2005 నాటితో పోలిస్తే ఈ ఉద్గారాల తీవ్రతను 21 శాతం మేర తగ్గించామని తెలిపారు. శనివారం జరిగిన 'వాతావరణ లక్ష్య సదస్సు-2020'ను ఉద్దేశించి ఆయన వర్చువల్​గా ప్రసంగించారు. పారిస్​ ఒప్పందం కుదిరి ఐదేళ్లు గడిచిన నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతోందని ఆయన గుర్తుచేశారు.

లక్ష్యాలను మరింతగా పెంచుకునే క్రమంలో గతాన్ని మనం విస్మరించరాదు. మన లక్ష్యాలను సవరించుకోవడమే కాకుండా.. ఇప్పటికే నిర్దేశించుకున్న లక్ష్యాలకు సంబంధించి మనం సాధించిన విజయాలను సమీక్షించుకోవాలి. అప్పుడే.. భావితరాల శ్రేయస్సు విషయంలో మన మాటలకు విశ్వశనీయత పెరుగుతుంది.

- నరేంద్ర మోదీ, ప్రధాని

భూగ్రంహంపై ఉన్న నా తోటివారందరికీ ఒక హామీ ఇస్తున్నా. 2047లో 100వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకునే నాటికి భారత్​ తన వాతావరణ లక్ష్యాలను సాధిచడమే కాదు.. వాటిని మించిన స్థాయిలో పనితీరును కనబరుస్తోంది.

- నరేంద్ర మోదీ, ప్రధాని

ABOUT THE AUTHOR

...view details