తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 15,158 మందికి కరోనా - దేశంలో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొత్తగా 15,158 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 42 వేలు దాటింది.

india  new corona cases latest update
దేశంలో మరో 15,158 మందికి కరోనా

By

Published : Jan 16, 2021, 10:08 AM IST

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 20వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా కొత్తగా 15,158 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. 16,977 మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 1,05,42,841
  • క్రియాశీల కేసులు: 2,11,033
  • కోలుకున్నవారు: 1,01,79,715
  • మరణాలు: 1,52,093

జనవరి 15 వరకు దేశవ్యాప్తంగా 18,57,65,491 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే 8,03,090 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

ఇదీ చదవండి :కరోనా అంతానికి భారతావని సిద్ధం- నేటి నుంచే టీకాలు

ABOUT THE AUTHOR

...view details