తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జీ7కు భారత్ సహజ భాగస్వామి' - g7 modi speech

జీ-7 సభ్యదేశాలకు భారత్​ సహజ భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ ముందుంటుందని స్పష్టం చేశారు.

narendra modi
ప్రధాని మోదీ

By

Published : Jun 13, 2021, 9:35 PM IST

ఉగ్రవాదం, అధికార దాహార్తి, ఆర్థిక నేరాలను ఎదురుక్కోవడంలో జీ-7 దేశాలకు భారత్​ సహకారం కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ7 కూటమికి భారత్ సహజ భాగస్వామి అని వ్యాఖ్యానించారు.

జీ-7 శిఖరాగ్ర సమావేశంలో నిర్వహించిన 'ఓపెన్​ సొసైటీస్​- ఓపెన్​ ఎకానమీస్​' అనే అంశంపై మోదీ వర్చువల్​గా ప్రసంగించారు. ప్రజాస్వామ్యం, ఆలోచనా స్వేచ్ఛ పట్ల భారతదేశ నాగరికతకు ఉన్న నిబద్ధతను వివరించారు.

భారత్​లో ఆధార్​, ప్రత్యక్ష నగదు బదిలీ విధానం, జన్​ధన్​-ఆధార్​-మొబైల్​ వంటి అప్లికేషన్స్​తో దేశంలో వచ్చిన మార్పును జీ-7 దేశాలకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details