తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులు రూ.55వేల కోట్లు.. మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కన్నా అధికం

India MLAs assets ADR report : దేశంలోని 4వేల మందికి పైగా ఎమ్మెల్యేలకు మొత్తం రూ.54,545 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఇది మూడు ఈశాన్య రాష్ట్రాల వార్షిక బడ్జెట్​ కన్నా ఎక్కవ అని తేలింది. అత్యధిక ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేల రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.

india mlas assets adr report
india mlas assets adr report

By

Published : Aug 1, 2023, 7:48 PM IST

India MLAs assets ADR report : దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 కోట్లుగా తేలింది. ఇది నాగాలాండ్, మిజోరం, సిక్కం రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కన్నా అధికమని వెల్లడైంది. ఈ మేరకు అసిసోయేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంయుక్త నివేదిక విడుదల చేశాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4001 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సమాచారాన్ని నివేదిక వెల్లడించింది. వీరందరి ఆస్తుల విలువ రూ.54,545 కోట్లని వివరించింది. నాగాలాండ్, మిజోరం, సిక్కిం రాష్ట్రాల ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ మొత్తం కలిపినా రూ.49,103 కోట్లేనని నివేదిక గుర్తు చేసింది.

ADR report on MLAs assets : ఎమ్మెల్యేల అఫిడవిట్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్- ఎన్ఈడబ్ల్యూ వెల్లడించాయి. మొత్తంగా 4033 మంది ఎమ్మెల్యేల్లో 4001 మంది సమాచారాన్ని విశ్లేషించినట్లు తెలిపాయి. ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.13.63 కోట్లుగా తేలిందని వివరించాయి.

పార్టీల వారీగా ఎమ్మెల్యేల సగటు ఆస్తుల వివరాలు..

  • బీజేపీ (1356 మంది ఎమ్మెల్యేలు)- సగటు ఆస్తి రూ.11.97 కోట్లు
  • కాంగ్రెస్ (719)- రూ.21.97 కోట్లు
  • టీఎంసీ (227)- రూ.3.51 కోట్లు
  • ఆప్ (161)- రూ.10.20 కోట్లు
  • వైసీపీ (146)- రూ.23.14 కోట్లు

పార్టీల వారీగా ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ

  • బీజేపీ (1356)- రూ.16,234 కోట్లు
  • కాంగ్రెస్ (719)- రూ.15,798 కోట్లు
  • వైసీపీ (146)- రూ.3,379 కోట్లు
  • డీఎంకే (131)- రూ.1,663 కోట్లు
  • ఆప్ (161)- రూ.1,642 కోట్లు

ఎమ్మెల్యేల ఆస్తుల్లో సగానికి పైగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలవేనని నివేదిక విశ్లేషించింది. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలకు రూ.32,032 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపింది. మొత్తం ఎమ్మెల్యేల ఆస్తుల్లో 58.73 శాతం ఈ రెండు పార్టీలకు శాసనసభ్యులవేనని వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ.. మిజోరం (రూ.14,210 కోట్లు), సిక్కిం (రూ.11,807 కోట్లు) రాష్ట్రాల బడ్జెట్ కన్నా అధికమని తెలిపింది.

రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు..
ఈశాన్య రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువగా ఉండగా.. అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేల రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కర్ణాటక ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మిజోరం, సిక్కం రాష్ట్రాల వ్యక్తిగత వార్షిక బడ్జెట్ల కన్నా అధికం. ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల్లో కర్ణాటక శాసనసభ్యుల వాటా 26 శాతం. రాజస్థాన్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, దిల్లీ, ఛత్తీస్​గఢ్, హిమాచల్​ప్రదేశ్, బంగాల్, గోవా, మేఘాలయా, ఒడిశా, అసోం, నాగాలాండ్, ఉత్తరాఖండ్, కేరళ, పుదుచ్చేరి, ఝార్ఖండ్, సిక్కిం, మణిపుర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల కన్నా కర్ణాటక శాసనసభ్యుల ఆస్తులే ఎక్కువ. ఈ 21 రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.13,976 కోట్లు.

ఎమ్మెల్యేల ఆస్తుల్లో టాప్ 3 రాష్ట్రాలు ఇవే..

  • కర్ణాటక (223 మంది ఎమ్మెల్యేలు) - రూ.14,359 కోట్లు
  • మహారాష్ట్ర (284) - రూ.6,679 కోట్లు
  • ఆంధ్రప్రదేశ్ (174) - రూ.4,914 కోట్లు

శాసనసభ్యుల ఆస్తులు తక్కువగా ఉన్న రాష్ట్రాలివే

  • మణిపుర్ (60) - రూ.225 కోట్లు
  • మిజోరం (40) - రూ.190 కోట్లు
  • త్రిపుర (59) - రూ.90 కోట్లు

ABOUT THE AUTHOR

...view details