India missile hit Pakistan: పాక్ భుభాగంలోకి భారత క్షిపణి దూసుకెళ్లడంపై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత క్షిపణి వ్యవస్థ అత్యంత సురక్షితమైందని.. దేశ రక్షణ వ్యవస్థ భద్రతా విధానాలు, నిబంధనలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. మార్చి 9న సాయంత్రం 7 గంటలకు పొరపాటున భారత క్షిపణి పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లిందని తెలిపారు. అయితే ఇది విచారకర ఘటన అని రాజ్నాథ్ అన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం జరగలేదని.. ఇంది కొంత ఊరట కలిగించే అంశమని పేర్కొన్నారు.
"ఆయుధ వ్యవస్థ భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. క్షిపణి పేలుడు ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. ఘటనకు గల కచ్చితమైన కారణాలు విచారణ ద్వారానే తెలుస్తాయి. క్షిపణి ఘటన నేపథ్యంలో రక్షణ పరికరాల కార్యకలాపాలు, నిర్వహణ తనిఖీల ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు కూడా సమీక్షిస్తున్నాం. ఈ విచారణ అనంతరంలో ఆయుధ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నట్లు బయటపడితే.. వాటిని సరిదిద్దేందుకు కట్టుబడి ఉంటాం."
- రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్