తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వేర్వేరు టీకాలను కలపడంపై భారత్​లో​ ప్రయోగం' - Is it safe to mix vaccines?

రెండు వేర్వేరు కొవిడ్​ వ్యాక్సిన్​ డోసులను కలిపితే రోగనిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి త్వరలోనే ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు ఎన్​టీఏజీఐ ఛైర్మన్​ ఎన్​కే అరోడా.

2 different Covid vaccines
వేర్వేరు టీకాలు

By

Published : May 31, 2021, 4:43 PM IST

రెండు వేర్వేరు కరోనా టీకా డోసులను కలపడంపై భారత్​లో​ త్వరలోనే ప్రయోగం చేయనున్నట్లు తెలిపారు ఇమ్యూనైజేషన్​పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా సంఘం(ఎన్​టీఏజీఐ) ఛైర్మన్ డా.ఎన్​కే అరోడా. రెండు టీకాల మిశ్రమం రోగనిరోధక శక్తిని ఎంతమేర పెంపొందిస్తోందో తెలుసుకునే అవకాశం ఈ ప్రయోగం ద్వారా కలుగుతుందని చెప్పారు.

రోజుకు కోటి టీకాలు..

"జూన్​ నుంచి దాదాపు 12 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని సీరం సంస్థ తెలిపింది. జులై చివరినాటికి సుమారు 12 కోట్ల కొవాగ్జిన్​ టీకాలు ఉత్పత్తి కానున్నాయి. కాబట్టి, ఆగస్టు కల్లా నెలకు 20 నుంచి 25 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయి. ఇతర తయారీ సంస్థలు లేదా విదేశాల నుంచి మరో ఐదారు కోట్ల డోసులు వచ్చే అవకాశం ఉంది. రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ ఇవ్వాలనేదే లక్ష్యం." అని చెప్పారు డా. అరోడా.

ఇదీ చూడండి:'టీకాతో ఏడాది పాటు రక్షణ'

ABOUT THE AUTHOR

...view details