తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2021, 1:15 PM IST

ETV Bharat / bharat

ఎయిర్​బస్​తో ఐఏఎఫ్ మెగా డీల్​!

భారత సైనిక సామర్థ్యాన్ని పెంచే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. సుమారు 18వేల కోట్లతో 56 రవాణా ఎయిర్​క్రాప్ట్​లను కొనుగోలు చేయడానికి సిద్ధం అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

India likely to finalise USD 2.5 billion deal to procure 56 transport aircraft for IAF
ఎయిర్​బస్​తో ఐఏఎఫ్ మెగా డీల్​

సైనిక అవసరాల కోసం భారత వైమానిక దళం(ఐఏఎఫ్​) మరో ప్రాజెక్టుకు ఆమోదం తెలపనుంది. 56 రవాణా ఎయిర్​క్రాఫ్ట్​లను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకుగాను సుమారు రూ. 18వేల కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఈ మెగాప్రాజెక్టులో ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ తో పాటు మరో భారతీయ సంస్థ భాగం కానుందని స్పష్టం చేశారు. మేకిన్​ ఇండియాలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

కొనుగోలు చేయనున్న మొత్తంలో సుమారు 40 విమానాలను ఎయిర్​ బస్​తో పాటు భారత్​కు చెందిన కంపెనీ మన దేశంలో తయారు చేయనుంది. దీంతో రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐఏఎఫ్​ వద్ద ఉండే ఏవీఆర్​ఓ విమానా స్థానంలో కొత్తగా కొనుగోలు చేయనున్న వాటిని వినియోగించనుంది. దేశ సైనిక సామర్థ్యాలను పెంచే దిశగా దీర్ఘకాలంగా ఉండిపోయిన ప్రాజెక్టులకు రక్షణ మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపుతోంది.

ఇదీ చూడండి: భారత్​కు సైనిక సామగ్రి విక్రయానికి యూఎస్​ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details