Leopard cub: దాహం తీర్చుకోవడానికి అడవిని వదిలి బయటకు వచ్చిన ఓ చిరుతపులి పిల్ల రెండు రోజులు నరకం చూసింది.
ఆ చిరుత పిల్ల దాహంతో నీరు తాగేందుకు ఓ క్యాన్లో మూతి పెట్టింది. దప్పిక తీరేంత వరకు నీరు తాగింది. తిరిగి తలను బయటకు తీసే క్రమంలో అసలు చిక్కు వచ్చి పడింది. తల ఇరుక్కుపోయింది. సుమారు రెండు రోజుల పాటు తలను అందులోనే ఉంచుకొని అడవి, ఊరు అనే తేడా లేకుండా చక్కర్లు కొట్టింది.
ఇలా వచ్చిన ఆ చిరుత పులి పిల్లను చూసి గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మనిషి కదలికలను గ్రహించిన చిరుత పిల్ల తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పట్టుకునేందుకు అధికారులు బాగా ఇబ్బంది పడ్డారు.