భారత్‌ను అత్యంత విశ్వనీయమైన భాగస్వామిగా రష్యా అభివర్ణించింది. ఇరుదేశాల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు, విభేదాలు లేవని తేల్చి చెప్పింది. రష్యా నుంచి పాకిస్థాన్‌కు పరిమిత సహకారం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
2003లో భారత్-పాక్ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై ఇరుదేశాలు ఏకతాటిపైకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు రష్యా మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్ బాబూష్కిన్ తెలిపారు. ఈ ఒప్పందం సరిహద్దుల్లో ఉండే ప్రాంతీయ స్థిరత్వానికి చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. అఫ్గాన్ విషయంలో రష్యా-భారత్ కలిసి పనిచేస్తాయని వెల్లడించారు.
"అఫ్గానిస్థాన్‌పై ప్రాంతీయంగా ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి భారత్ తప్పనిసారిగా చొరవ చూపాలి. ఇందుకు సంబంధించి ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయి."