Rahul Dravid: హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హాజరుకానున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ద్రవిడ్ కొట్టిపారేశారు. అవన్నీ నిజం కాదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే..
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మే 12 నుంచి 15వ తేదీ వరకు భాజపా యువ మోర్చా నేషనల్ వర్కింగ్ కమిటీ సదస్సు జరగనుంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన కాషాయ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. అయితే ఈ సదస్సుకు రాహుల్ ద్రవిడ్ హాజరుకానున్నారని ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా చెప్పినట్లు నిన్న పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ద్రవిడ్ ఈ సదస్సులో పాల్గొని యువతకు మంచి సందేశం ఇవ్వనున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ కథనాలను కొట్టిపారేశారు ద్రవిడ్
" మే 12-15 మధ్య నేను హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కావు"
- రాహుల్ ద్రవిడ్, టీమిండియా హెడ్ కోచ్.