సామ్రాజ్యవాదానికి, ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమని అనేక సందర్భాల్లో స్పష్టం చేశామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు మంగళవారం పార్లమెంటుకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరి సుస్పష్టం'
ఉగ్రవాదం పట్ల భారత్ తన విధానాన్ని ఎన్నో సార్లు స్పష్టం చేసిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఏ దేశం కూడా ఇతర దేశాల సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాలపై చర్చలు నిర్వహించకూడదని పేర్కొన్నారు.
'ఉగ్రవాదంపై భారత్ తన విధానాన్ని స్పష్టం చేసింది'
ఏ దేశం కూడా ఇతర దేశాల సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాలపై చర్చలు నిర్వహించకూడదని బిర్లా పేర్కొన్నారు. సాగు చట్టాలపై బ్రిటన్ చట్టసభ్యులు ఇటీవల చేపట్టిన చర్చలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంటుందని అన్నారు.
ఇదీ చదవండి :'భారత్, పోర్చుగల్ మధ్య సోదర బంధం'