తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారత్ ఎన్నిక

ఐక్యరాజ్యసమితిలో భారత్ మరో గౌరవాన్ని సొంతం చేసుకుంది! ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో)లోని(Unesco india) ప్రపంచ వారసత్వ కమిటీ సభ్యదేశంగా ఎన్నికైంది. 2025 వరకు అందులో కొనసాగనుంది.

UNESCO
యునెస్కో

By

Published : Nov 26, 2021, 7:08 AM IST

యునెస్కోలోని ప్రపంచ వారసత్వ కమిటీ(unesco india) సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది. నాలుగేళ్ల పాటు ఈ కమిటీలో కొనసాగనుంది భారత్. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి భారత్ ఈ కమిటీలో చోటు దక్కించుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి ట్విటర్ వేదికగా వెల్లడించారు.

"ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి భారత్ ఈ కమిటీలో చోటు దక్కించుకుందని చెప్పేందుకు సంతోషంగా ఉంది. ఈ చారిత్రక విజయంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు."

-- మీనాక్షి లేఖి, విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి

ప్రపంచ వారసత్వ కమిటీ ఏడాదికోసారి సమావేశమవుతుంది. ప్రపంచ వారసత్వ కన్వెన్షన్​ను ఈ కమిటీ నిర్వహిస్తుంది. 2021-25 కాలానికి యునెస్కో కార్యనిర్వాహక బోర్డులో సభ్య దేశంగా భారత్ మరోసారి ఎన్నికైన సంగతి గమనార్హం.

ఇదీ చూడండి:ఆస్ట్రేలియన్​ అకాడమీ ఆఫ్​ సైన్స్​ అధ్యక్షుడిగా చెన్నుపాటి జగదీశ్​

ABOUT THE AUTHOR

...view details