తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడో స్పేస్ మిషన్​ కోసం ఫ్రాన్స్​తో ఇస్రో జట్టు

అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రాన్స్‌ తమకు అతిపెద్ద భాగస్వామి అని అన్నారు ఇస్రో ఛైర్మన్ కే శివన్. ఉమ్మడిగా ఇప్పటికే అంతరిక్షంలోకి రెండు ఉపగ్రహ మిషన్లను పంపిన ఇరు దేశాలు మరో ఉపగ్రహ మిషన్‌ని పంపేందుకు కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.

India, France working on third joint space mission: ISRO Chairman
మూడో స్పేస్ మిషన్​ కోసం ఫ్రాన్స్​తో ఇస్రో జట్టు

By

Published : Mar 20, 2021, 2:51 PM IST

భారత అంతరిక్ష ప్రయాణంలో మరింత ముందుకు వెళ్లేందుకు ఫ్రాన్స్‌తో కీలక ముందడుగు వేస్తోంది ఇస్రో. ఉమ్మడిగా ఇప్పటికే అంతరిక్షంలోనికి రెండు ఉపగ్రహ మిషన్లను పంపిన ఇరు దేశాలు మూడవ ఉపగ్రహ మిషన్‌ని పంపేందుకు కలిసి పనిచేస్తున్నామని ఇస్రో ఛైర్మన్‌ కె. శివన్‌ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రాన్స్‌ తమకు అతిపెద్ద భాగస్వామి అని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్, విజ్ఞాన్ ప్రసార్ నిర్వహించిన అన్‌లాకింగ్‌ ఇండియా స్పేస్‌ పొటెన్షియల్‌-జియోస్పైటల్‌ డాటా, మ్యాప్‌ కార్యక్రమంలో ఆయన అన్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో, ఫ్రాన్స్‌ అంతరిక్ష సంస్థ-సీఎన్ఈఎస్​ కలిసి 2011, 2013లో రెండు ప్రయోగాలు చేశాయని శివన్ తెలిపారు. ప్రస్తుతం మడో మిషన్‌ కోసం పనిచేస్తున్నామని వెల్లడించారు. భూమి పరిశీలన ఉపగ్రహం థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజర్‌తో మిషన్, థర్మల్ హై రిజల్యూషన్ నేచురల్ కోసం ఇన్ఫ్రా రెడ్ ఇమేజింగ్ ఉపగ్రహం వనరుల అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు.

ఇదీ చూడండి:'ఇండోపసిఫిక్​ సుస్థిరతకు అమెరికా-భారత్​ బంధం కీలకం'

ABOUT THE AUTHOR

...view details