ఇండో-పసిఫిక్ ప్రాంతంలో త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలు చర్చలు జరిపాయి. సముద్ర భద్రత, మానవతా సాయం, విపత్తు ఉపశమనంతో సహా పలు విషయాలపై గతేడాది జరిగిన విదేశాంగ కార్యదర్శి స్థాయి త్రైపాక్షిక సంభాషణ ఫలితాలపై మూడు దేశాల అధికారుల సమావేశమయ్యారు.
ఈ భేటీలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో త్రైపాక్షిక సహకారం కోసం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించినట్లు విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ విదేశాంగ సంయుక్త కార్యదర్శి సందీప్ చక్రవర్తి, ఫ్రాన్స్ నుంచి బెర్ట్రాండ్ లోర్థోలరీ, ఆస్ట్రేలియా తరఫున గ్యారీ కోవన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.