ప్రజాస్వామ్య సూచీకి సంబంధించి 2020 ప్రపంచ ర్యాంకుల్లో భారత్ 53కు పడిపోయింది. అధికారుల్లో ప్రజాస్వామ్యంపై గౌరవం తగ్గడం, పౌర స్వేచ్ఛను అణచివేయడం వంటి కారణాల వల్ల దేశ ర్యాంకింగ్ పడిపోయిందని ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ పేర్కొంది. అయితే.. పొరుగు దేశాలతో పోల్చితే మాత్రం భారత్ మెరుగైన స్థానంలో ఉండడం విశేషం.
2019లో భారత్ మొత్తంగా 6.9 స్కోర్ సాధించగా ఇప్పుడు అది 6.61కి పడిపోయింది. మొత్తం 167 దేశాలకు సంబంధించి ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రజాస్వామ్య సూచీలకు సంబంధించి ర్యాంకులు ఇస్తుంది.