భారత్ మరోసారి తన ఉదారత చాటుకుంది. కొవిడ్‌తో కొట్టిమిట్టాడుతున్న దేశాలకు గతంలో కోట్లాది టీకా డోసులను ఎగుమతి(India vaccine export) చేసిన భారత్.. తాజాగా మరిన్ని డోసులను పొరుగు దేశాలైన మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్ సహా ఇరాన్‌కు అందించినట్లు సమాచారం. మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్‌లకు 10 లక్షలు చొప్పున కొవిషీల్డ్ టీకా డోసులు అందించగా.. ఇరాన్‌కు మూడు లక్షల కొవాగ్జిన్ డోసులను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్ టీకాలు అందించి(vaccine maitri) అండగా నిలిచింది భారత్. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు(vaccine maitri) అందించి, సాయపడుతోంది.